వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కరోనా బాధితుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 6 రోజులపాటు చికిత్స తీసుకున్నాడు. బాధితునికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. బాధితుని కోరిక మేరకు చికిత్సకు కావల్సిన మందులను ఇచ్చి ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. అయితే ఇంటికి వెళ్తున్న బాధితున్ని ఊరి బయటే అడ్డగించిన గ్రామస్థులు ఊళ్లోకి రావద్దని తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులను సైతం చూడకుండా కళ్లనిండా నీటితో వెనుదిరిగి ఊరు బయట ఉన్న ఓ పాడుబడ్డ ఇంట్లో సుమారు 6 గంటలపాటు తలదాచుకున్నాడు.
అమానవీయం: ఊరి బయటే కరోనా బాధితుడు - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా వార్తలు
కరోనా బారిన పడినవారిపై వివక్షత చూపొద్దని ప్రభుత్వం.. టీవీ, ఫోన్ కాలర్ యాడ్స్ ద్వారా ఆవగాహన కల్పిస్తున్నా.. ప్రజల్లో వైరస్‌పై ఉన్న భయాందోళనలు తగ్గడం లేదు. ఓ వ్యక్తికి కరోనా సోకిందని ఆ గ్రామ ప్రజలు ఊరు బయట పాడుబడ్డ ఇంట్లో ఉంచడం మహమ్మారిపై గ్రామీణ ప్రజల్లో ఎంతమేర అవగాహన ఉందనేదానికి అద్దం పడుతోంది. ఈ అమానవీయ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది.
అమానవీయం: ఊరి బయటే కరోనా బాధితుడు
అనంతరం గ్రామంలోని కొంతమంది చదువుకున్న యువకులు గ్రామస్థులకు అర్థమయ్యేలా చెప్పి బాధితుని ఇంటికి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. వర్ధన్నపేట పట్టణ శివారులో ఇంతా అమానవీయం ఘఠన జరిగిన అధికారులు ఎవరూ బాధితుని వద్దకు వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇదీ చదవండి:కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్