తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంట్ షాక్​తో ఆవు మృతి..శోకసంద్రంలో లేగదూడ.. - మృతి

వరంగల్ గ్రామీణ జిల్లాలో కరెంటు తీగలు తాకి జెర్సీ ఆవు మృతి చెందింది. కన్నతల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి లేగదూడ శోకసంద్రంలో మునిగిపోయింది.

కరెంటు షాక్​కు గురై జెర్సీ ఆవు మృతి

By

Published : Aug 8, 2019, 3:26 PM IST

Updated : Aug 8, 2019, 3:47 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో గాజుగాని రమేష్​కు చెందిన జెర్సీ ఆవు కరెంటు షాక్​కు గురై మృతి చెందింది. తన తల్లి విగతజీవిగా ఉండటాన్ని చూసి లేగదూడ తట్టుకోలేకపోయింది. దీనంగా తల్లి మృతదేహాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆవును తాకుతూ లేపేందుకు ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని చూసి రైతు దంపతులతోపాటు చుట్టుపక్కల స్థానికులు చలించిపోయారు.కన్నీళ్ల పర్యంతమయ్యారు.

కరెంటు షాక్​కు గురై జెర్సీ ఆవు మృతి
Last Updated : Aug 8, 2019, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details