తెలంగాణ

telangana

ETV Bharat / state

కరెంట్ పోయింది.. కోళ్ల ప్రాణం ఆగింది... - no power

అసలే ఎండలు... మూడు రోజుల నుంచి నిలిచిపోయిన విద్యుత్తు... అధికారుల నిర్లక్ష్యం... ఇవన్నీ కలిపి కోళ్ల ఫారం నడుపుతున్న వ్యక్తికి లక్షల్లో నష్టాన్ని మిగిల్చాయి. సుమారు నాలుగు వేల కోళ్లు మృతి చెంది ఓ కుటుంబానికి తీరని కష్టాన్ని తెచ్చిపెట్టాయి.

నాలుగు వేల కోళ్లు మృతి

By

Published : May 27, 2019, 10:29 AM IST

Updated : May 27, 2019, 3:07 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన మూడు చక్రూ కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. ఐదువేల కోళ్లు పెంచుతున్నాడు. మూడు రోజుల కిందట గాలి దుమారం వల్ల విద్యుత్ సమస్య తలెత్తింది. అప్పటినుంచి గ్రామంలో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ఈ క్రమంలో కోళ్ల ఫారంలోని కోళ్లకు నీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరించాలని అధికారులను వేడుకున్నా వారు పట్టించుకోలేదు. ఎండ వేడిమికి నీరు లేక సుమారు నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి. 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చక్రూ ఆవేదన వ్యక్తం చేశాడు.

నాలుగు వేల కోళ్లు మృతి
Last Updated : May 27, 2019, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details