రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాహనాల చోరీకి పాల్పడుతున్న ఓ ముఠాను వరంగల్ రురల్ జిల్లా పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల నుంచి 4 ఆటోలు, 7 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో నిలిపే వాహనాలే లక్ష్యంగా చేసుకొని నిందితులు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ.. వరంగల్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన 24 వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. వారిలో పలువురు.. గతంలో పలు కేసులకు సంబంధించి శిక్ష అనుభవించినట్లు వివరించారు.