తెలంగాణ

telangana

ETV Bharat / state

'విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి' - వర్ధన్న పేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ తాజా వార్తలు

విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కుడా కార్యాలయంలో ఆయన​ సమీక్షించారు. రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు.

'విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి'
'విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి'

By

Published : Nov 19, 2020, 10:45 PM IST

విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ ఆదేశించారు. వరంగల్​ రూరల్​ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాల కార్పొరేటర్లు, వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి హన్మకొండలోని కుడా కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ సమీక్షా సమావేశం నిర్వహించారు.

విలీన గ్రామాల కార్పొరేటర్లు, వరంగల్ మున్సిపల్ కమిషనర్​తో ఎమ్మెల్యే సమావేశం

వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లు పూర్తిగా విలీన గ్రామలతో నిండి ఉన్నాయని, వాటి అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్​ కోరారు. విలీన గ్రామాల్లో రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్​లో పెట్టాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:పెట్టుబడులకు పోటీ... హైదరాబాద్​ నలువైపులా ఐటీ!

ABOUT THE AUTHOR

...view details