వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విన్నవించారు. జనగామ జిల్లా కొడకండ్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రితో వర్ధన్నపేటలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే రమేష్ చర్చించారు. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపిన ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలను కూలంకషంగా పరిష్కరిస్తామని వెల్లడించారు.
నిధులు మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్కు వినతి - జనగామ జిల్లా వార్తలు
జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కలిశారు. నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయాలని సీఎంకు వినతులు సమర్పించారు.
నిధులు మంజూరు చేయాలంటూ సీఎం కేసీఆర్కు వినతి