వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని పీహెచ్సీ ఆధ్వర్యంలో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం అస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
Mla aroori ramesh: వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేష్ - వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తాజా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. అర్హులందరూ టీకా తీసుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేష్
కరోనా పరీక్షలు, మందుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని ఎమ్మెల్యే అరూరి రమేష్ వైద్యులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని... ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా