ప్రయాణికులు రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని వర్ధన్నపేట సర్కిల్ ఏసీపీ గొల్ల రమేష్ హెచ్చరించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన వాహనదారులకు అవగాహన కల్పించారు.
'రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవు' - wardhannapet acp golla ramesh latest updates
వరంగల్ గ్రామీణ జిల్లాలోని వర్ధన్నపేట సర్కిల్ ఏసీపీ గొల్ల రమేష్ రోడ్డు భద్రత చర్యలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. వాహనదారులు నిబంధనలు అతిక్రమించొద్దని హెచ్చరించారు.
'రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవు'
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని సూచించారు. గ్రామాలలో ప్రయాణించే ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కరాదని విజ్ఞప్తి చేశారు. పోలీసుల హెచ్చరికలను విస్మరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:అక్రమంగా మద్యం తరలింపు.. అదుపులో నిందితులు