వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట సర్కిల్ పరిధిలో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రమేశ్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో కిరాణ వర్తకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు.
గుట్కాలు, పొగాకు సంబంధిత పదార్థాలు వాడడం వల్ల నోటి కాన్సర్, కాలేయ సంబంధిత ప్రమాదకర జబ్బుల బారిన పడతారని ఏసీపీ రమేశ్ తెలిపారు. వ్యాపారులు ధనార్జనకోసం ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా దొంగచాటుగా గుట్కాలు అమ్ముతున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.