వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రారంభించారు. కరోనా బారిన పడకుండా రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు.
'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం తప్పనిసరి'
కరోనా బారినపడకుండా రైతులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సూచించారు. కేంద్రాల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
వర్ధన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలని, రైతులకు శానిటైజర్ అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే.. అధికారులను ఆదేశించారు. అనంతరం హమాలీ కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు.