గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కళ్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. తెరాస పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తోందని అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తెలంగాణ తల్లి విగ్రహన్ని ఆవిష్కరించారు.
తెరాస పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తోంది: ఎమ్మెల్యే - వరంగల్ రూరల్ తాజా వార్తలు
తెరాస పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తెరాస పాలనలో అభివృద్ధి పరుగులు తీస్తోంది
రైతులకు సబ్సిడీ మోటార్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న తెరాస ప్రభుత్వాన్ని... ప్రజలు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు తీపికబురు