వరంగల్ గ్రామీణ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పిడుగులు పడి ఇద్దరు రైతులు మృతి చెందారు. గీసుకొండ మండలం మచ్చాపురంలో పిడుగు పడి మర్రి దూడయ్య అనే రైతు మృతి చెందగా... ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన నన్నెబోయిన పూల అనే మహిళా రైతు పిడుగు ధాటికి కన్నుమూసింది. ఇద్దరు రైతులు వారివారి పంట చేనుల్లో పని చేస్తుండగా... భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం సమయంలో పూలమ్మతో పాటు తన కుమారునిపై సైతం పిడుగు పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
రెండు గ్రామాల్లో పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి - రెండు గ్రామాల్లో పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి
వరంగల్ గ్రామీణ జిల్లాలో రెండు వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. కానీ... వీరిద్దరి మరణానికి కారణం మాత్రం పిడుగే కారణం. పొలం పనుల్లో మునిగిపోయిన రైతులను పిడుగు పొట్టనబెట్టుకుంది.

Two farmers killed in two villages
రెండు గ్రామాల్లో పిడుగుపడి ఇద్దరు రైతులు మృతి