వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో విషాదం చోటుచేసుకుంది. పంటపొలానికి వెళుతూ... విద్యుతాఘాతానికి గురై ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. వరుసకు బావ, బామ్మరుదులైన సమ్మయ్య, సుధాకర్ ఉదయాన్నే పొలానికి వెళ్లారు. మరో రైతు తన వరిపంట వద్దఅడవి జంతువుల కోసంవిద్యుత్ తీగలు ఏర్పాటు చేశాడు. తీగను గమనించని సమ్మయ్య, సుధాకర్... విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మరణించటం వల్ల కొండాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఓ రైతు చేసిన పనికి.. ఇద్దరు రైతులు బలి - CRIME NEWS IN TELANGANA
అడవి జంతవుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగ తగిలి ఇద్దరు రైతులు మృతిచెందారు. వరంగల్ గ్రామీణ జిల్లా కొండాపురంలో ఈ ఘటన జరిగింది.
![ఓ రైతు చేసిన పనికి.. ఇద్దరు రైతులు బలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5035983-thumbnail-3x2-kkk.jpg)
TWO FARMERS DIED WITH CURRENT SHOCK IN KONDAPUR
పంటను కాపాడుకునేందుకు వేసిన కంచే... రైతుల ప్రాణాలు తీసింది