ఆర్టీసీ సమ్మె రాష్ట్రవ్యాప్తంగా 14వ రోజూ కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో తెల్లవారుజామునుంచే ఆందోళనకు దిగారు. తాత్కాలిక కార్మికులు బస్సులు నడపొద్దంటూ విజ్ఞప్తి చేశారు. బస్ డిపోల్లోకి వెళ్లకుండా అడ్డుపడ్డారు. పరకాల పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. విధులకు ఆటంకాలు కలిగించకుండా ఆర్టీసీ కార్మికులను డిపో దగ్గర్నుంచి వెళ్లగొట్టారు. నిన్న ఇదే సమయానికి దాదాపు 70 బస్సులు ఆర్టీసీ డిపో నుంచి బయటకు రాగా ఇవాళ మాత్రం 17 బస్సులు మాత్రమే రవాణా కోసం బయటికి వచ్చాయి.
'తాత్కాలిక కార్మికులు బస్సులు నడపొద్దు' - tsrtc strike news
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ డిపో వద్ద హైడ్రామా నెలకొంది. ఆర్టీసీ కార్మికులు బృందాలుగా ఏర్పడి తాత్కాలిక కార్మికులు తమకు సహకరించాలని కోరారు. బస్సులు నడపొద్దని విజ్ఞప్తి చేశారు.
tsrtc union workers strike in warangal