ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజు ఉద్ధృతంగా కొనసాగుతోంది. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసి కార్మికులు, పలు కార్మిక, విద్యార్థి సంఘాల నాయకులు భిక్షాటన చేశారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈనెల 19న జరిగే బంద్‌ను తీవ్రతరం చేస్తామని.. జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
భిక్షాటన చేసిన ఆర్టీసీ కార్మికులు - tsrtc
రోజురోజుకు ఆర్టీసీ సమ్మె ఉద్ధృతమవుతోంది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేశారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు
భిక్షాటన చేసిన ఆర్టీసీ కార్మికులు