వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో మంగళవారం మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ యాకుబ్ పాషా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నర్సంపేటలో బంద్ చేపట్టారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చేసిన ఆందోళనలో పోలీసులకు, కార్మికులకు తోపులాట జరిగింది. యాకుబ్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని నెక్కొండ ప్రధాన కూడలి వద్ద మానవహారం నిర్వహించారు.
రంగప్రవేశం దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడం వల్ల వరంగల్, నెక్కొండ, నర్సంపేట పట్టణం వైపు ఉన్న రోడ్ల పై వాహనాలు నిలిచిపోయాయి. రంగప్రవేశం చేసిన పోలీసులు నిరసనకారులను వెళ్లిపోవాలని కోరారు. అయినప్పటికీ వినకపోవడం వల్ల ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేశారు. వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం రోడ్లపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలను క్రమపద్ధతిలో పంపించారు.
ఎమ్మెల్యే కార్యాలయ ముట్టడికి ఆర్టీసీ కార్మికుల యత్నం ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'