తెలంగాణ

telangana

ETV Bharat / state

డిపో ముందు బైఠాయించి.. తాత్కాలిక సిబ్బంది అడ్డగింత - tsrtc employees strike at parakala latest

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో 41వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నాలుగు గంటల పాటు డిపో ముందు బైఠాయించి తాత్కాలిక సిబ్బంది విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.

డిపో ముందు బైఠాయించి.. తాత్కాలిక సిబ్బంది అడ్డగింత

By

Published : Nov 14, 2019, 11:00 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 41వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో ఆందోళనలు, నిరసనలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరకాల డిపో ముందు నాలుగు గంటలపాటు బైఠాయించారు. తాత్కాలిక సిబ్బందిని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

డిపో ముందు బైఠాయించి.. తాత్కాలిక సిబ్బంది అడ్డగింత

ABOUT THE AUTHOR

...view details