వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. విధులకు హాజరవుతామన్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు.
'జయశంకర్ సార్... కేసీఆర్ కలలోకి రండి' - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019
ఎటువంటి డిమాండ్లు లేకుండా విధులకు హాజరవుతామన్నా.. సీఎం కేసీఆర్ కనికరం చూపడంలేదని వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
పరకాల డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళన
ప్రొఫెసర్ జయశంకర్ సీఎం కేసీఆర్ కలలోకి వచ్చి తమ బాధలు తీర్చేలా చేయాలని కోరుకున్నారు. డిపో ఎదుట జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
తెలంగాణ ఉద్యమానికి సహకరించిన ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.