వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. విధుల్లోకి ఎందుకు తీసుకోరో అధికారులను అడుగుదామని వచ్చిన కార్మికులను హన్మకొండ డిపో వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేయడానికి రాలేదంటూ చెప్పినా పట్టించుకోకుండా బలవంతంగా వ్యానుల్లోకి ఎక్కించారని కార్మికులు వాపోయారు.
'ఆందోళన చేయకపోయినా అరెస్టు చేస్తున్నారు' - rtc employees arrest at warangal
విధుల్లోకి వచ్చిన తమను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని... తమను ఎందుకు విధుల్లోకి తీసుకోరో అధికారులను అడిగే తావు కూడా ఇవ్వట్లేదని ఆర్టీసీ కార్మికులు వాపోయారు.
'ఆందోళన చేయకపోయినా అరెస్టు చేస్తున్నారు'
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ఉద్రిక్తత..