వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట శివారులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యాకయ్య దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాకయ్య అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వివాహబంధాన్ని కబళించిన మృత్యువు - Crime news in Warangal rural district
వరంగల్ గ్రామీణ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొద్ది క్షణాలైతే ఇల్లు చేరాల్సిన దంపతులను బస్సు రూపంలో మృత్యువు కబళించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహబంధాన్ని కబళించిన మృత్యువు
బాధితులది రాయపర్తి మండలం గన్నారంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.