స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం దేవాదుల సమీపంలోని ధర్మసాగర్‌కు వరంగల్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్, స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రచారానికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటెయ్యాలని ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.
తమ సమస్యలు పట్టించుకోకుండా ఎలా ఓట్లు అడిగేందుకు వచ్చారని నిలదీశారు. జీతాలు సరిగా చెల్లించడం లేదని పంప్‌హౌస్ నిర్మాణ కార్మికులు వాపోయారు. తమను పర్మినెంట్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఫ్లెక్సీ పెట్టి ఆందోళన చేపట్టారు. వీరికి స్థానికులు కూడా తోడయ్యారు. కార్మికుల తీరుపై ఎమ్మెల్యే రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో ఇలాంటి నిరసన సరైనది కాదని.. ఆపకపోతే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు.
ఈ హెచ్చరికలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, ఇతర తెరాస నేతలు స్పందించారు. వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తామని నచ్చచెప్పారు. తనను మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని దయాకర్ హామీ ఇచ్చారు.
పసునూరికి దేవాదుల కార్మికుల నిరసన సెగ - compaign
వరంగల్ గ్రామీణ జిల్లా దేవాదుల వద్ద తెరాస నేతలకు నిరసన సెగ తగిలింది. పంప్‌హౌస్ కార్మికులు, స్థానికులు తెరాస నేతలపై ఆందోళనకు దిగారు. ఎన్నికల ప్రచారంలో ఇటువంటి చర్యలు సరైనవి కావని ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించగా... తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ నచ్చచెప్పారు.
పసునూరికి నిరసన సెగ
ఇవీ చూడండి: 'ఆంధ్రులకు అన్యాయం చేస్తే తెలంగాణ తరహా పోరాటమే'