ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండల కేంద్రంలోని చర్చిలో పేద క్రైస్తవులకు ప్రభుత్వం అందించే చీరలను ఆయన పంపిణీ చేశారు.
'కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం' - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్రిస్మస్ చీరల పంపిణీ
పండుగలు జరుపుకోలేని స్థితుల్లో ఉన్న అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం ద్వారా కానుకలు అందచేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రికే చెందుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని వరంగల్ రూరల్ జిల్లాలోని ఓ చర్చిలో పేద క్రైస్తవులకు చీరల పంపిణీ చేశారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని పేర్కొన్నారు.
అన్ని కులమతాలకు గౌరవిస్తూ, వారి అభివృద్ధికి కృషిచేస్తోన్న ఏకైక సీఎం కేసీఆరే అని చల్లా ధర్మారెడ్డి అన్నారు. కరోనా కారణంగా ఆర్ధిక సంక్షోభం ఏర్పడినప్పటికీ.. సంక్షేమ పథకాలను కొనసాగించి ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందన్నారు. పండుగలు జరుపుకోలేని స్థితుల్లో ఉన్న అన్ని వర్గాల పేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా కానుకలు అందచేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రికే చెందుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి, జెడ్పిటిసి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు,రెవెన్యూ శాఖ అధికారులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సమాజంలో అన్ని మతాలను గౌరవించాలి : తలసాని