తెరాసను ఎదుర్కొనలేకనే భాజపా నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార సభకు పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా భాజపా ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల భర్తీ గురించి ఆ పార్టీ నేతలు మర్చిపోయారని ఎర్రబెల్లి చెప్పారు.
అబద్ధమని నిరూపిస్తే ఎన్నిక నుంచి తప్పుకుంటా: పల్లా - telangana varthalu
గతంలో దేశవ్యాప్తంగా భాజపా ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాల భర్తీ హామీ గురించి ఆ పార్టీ నేతలు మర్చిపోయారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఆరేళ్లలో లక్షా 32వేల పోస్టులు భర్తీ చేశామని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు ఇది అబద్ధమని నిరూపిస్తే తాను ఎన్నిక నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.
అబద్ధమని నిరూపిస్తే ఎన్నిక నుంచి తప్పుకుంటా: పల్లా
ఆరేళ్లలో లక్షా 32వేల పోస్టులు భర్తీ చేశామన్న పల్లా... ప్రతిపక్షాలది నిరాధార ఆరోపణలు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇది అబద్ధమని నిరూపిస్తే తాను ఎన్నిక నుంచి తప్పుకుంటానని బహిరంగంగా ప్రకటించారు.
ఇదీ చదవండి:పోలీసుల తీరుపై డీజీపీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.!