మంత్రి ఎర్రబెల్లికి మొక్కలు నాటి అంకితమిచ్చిన నాయకులు - errabelli birthday
హరితహారంలో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో తెరాస యువజన నాయకులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అంకితమిచ్చారు.
trs leaders gifted plant to minister errabelli dhayakar rao
పంచాయతీరాజ్ శాఖ మంత్రి పుట్టినరోజు సందర్భంగా వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి తెరాస యువజన నాయకులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో పోలీసులతో కలిసి మొక్కలు నాటారు. శుక్రవారం మంత్రి పుట్టినరోజు బహుమతిగా మొక్కను నాటామని తెలిపిన నాయకులు... మొక్క పెరిగి పెద్దయి ఎంతో మందికి నిడనివ్వాలని ఆశించారు. హరితహారంలో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కను నాటి సంరక్షించాలని యువజన నాయకులు కోరారు.