వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట ఎంపీపీ ఎన్నిక ముందు రాజకీయ నాయకుల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎంపీటీసీ రజితను కాంగ్రెస్ పార్టీ వారే కిడ్నాప్ చేశారని రజిత భర్త భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజిత మాత్రం తాను కాంగ్రెస్ పార్టీ వారితోనే ఉన్నానని తనను ఎవరు ఏం చేయలేదని మీడియాకు తెలిపింది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేషన్ ముందు రాస్తారోకో చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకొని శాంతింపజేశారు. అనంతరం భిక్షపతితో పాటు కొందరు తెరాస నాయకులు రజిత వద్దకు రావడం వల్ల పోలీస్ స్టేషన్ పక్కనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మహిళ నాయకురాలు ఆగ్రహంతో గులాబీ పార్టీ నాయకులపై చెప్పుతో దాడి చేసింది. పరిస్థితి మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది.
తెరాస నాయకులపై చెప్పుతో దాడి - mptc
నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ రజితను హస్తం పార్టీ వారే కిడ్నాప్ చేశారని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని ఆమె మీడియాకు తెలిపింది. రజిత కోసం వచ్చిన తెరాస నాయకులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు చెప్పుతో దాడి చేసింది.
తెరాస నాయకులపై చెప్పుతో దాడి