తెలంగాణ

telangana

ETV Bharat / state

నిన్నటి ఆందోళనలకు నిరసనగా పరకాల బంద్ - సోమవారం పరకాల బంద్​

పరకాలలో బంద్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తల దాడిని నిరసిస్తూ సోమవారం పరకాల బంద్​కు తెరాస పిలుపునిచ్చింది. తెరాస కార్యకర్తలు వాహనాలపై తిరుగుతూ దుకాణాలను మూయిస్తున్నారు.

నేడు పరకాల బంద్‌కు పిలుపునిచ్చిన తెరాస
నేడు పరకాల బంద్‌కు పిలుపునిచ్చిన తెరాస

By

Published : Feb 1, 2021, 9:14 AM IST

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాలనియోజకవర్గంలో బంద్ కొనసాగుతోంది. తెరాస పార్టీ, స్థానిక వ్యాపార సంస్థలు బంద్​లో పాల్గొంటున్నాయి. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై భాజపా శ్రేణుల దాడిని నిరసిస్తూ బంద్​కు పిలుపునిచ్చారు. తెరాస కార్యకర్తలు వాహనాలపై తిరుగుతూ వాణిజ్య సముదాయాలను మూయిస్తున్నారు. ఆర్టీసీ సర్వీసులు నిలిపివేశారు.​ నిరసనకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని తెరాస కోరింది.

రామజన్మభూమి పేరిట విరాళాలు వసూలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆరోపణపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం హన్మకొండలోని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై భాజపా కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపుచేశారు.

ఇదీ చూడండి:భాజపా కార్యాలయానికి నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

ABOUT THE AUTHOR

...view details