మేడిగడ్డ నుంచి వివిధ దశల్లో ఎల్లంపల్లికి నీటిని ఎత్తి పోసి పైనుంచి వరద రాగానే తిరిగి నీటిని గోదావరిలోకి వదిలేస్తున్నారంటే ఇది తిప్పి పోతల ప్రాజెక్ట్ అని కోదండరాం ఎద్దేవా చేశారు. ప్రాణహిత మీదున్న తుమ్మిడిహట్టి నుంచి నీటిని తరలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వెల్లడించారు. మిడ్మానేరు నుంచి నీటిని దిగువకు తరలించటం వల్ల ఏటా అదనంగా రూ.180కోట్ల విద్యుత్ ఖర్చు కానుందన్నారు. తక్కువ ఎత్తులో నీటిని ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లి కిందికి వదిలే పథకం ప్రపంచంలో ఇదే మొదటిదని అన్నారు.
'కాళేశ్వరం ఎత్తి పోతల కాదు... తిప్పి పోతల పథకం' - TJS Party President Kodandaram
కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కాదని.. తిప్పి పోతల పథకమని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో విమర్శించారు.
'ఎత్తి పోతల కాదు... తిప్పి పోతల పథకం'