తెలంగాణ

telangana

ETV Bharat / state

జలుబు చేసిందని ఆసుపత్రికి తీసుకొచ్చారు... అంతలోనే! - babe killed in parakala

జలుబు చేసిందని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంతా బాగానే ఉందని డాక్టరు చెప్పారు. అంతలోనే చనిపోయిందని నిర్ధరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మూడు నెలల పసికందు మృతి

By

Published : Nov 3, 2019, 11:50 PM IST

పరకాలలో మూడు నెలల పసికందు మృతి
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో వైద్యం వికటించి మూడు నెలల పసికందు మృతిచెందింది. జయశంకర్ జిల్లా చింతగాని గ్రామానికి చెందిన భార్యభర్తలు శంకర్, రోజా తమ పాపకు జలుబు చేసిందని పరకాలలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పాపకు బాగానే ఉందని చెబుతూ.. సాయంత్రం ఐదుగంటలకు పాప చనిపోయిందని వైద్యుడు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details