గ్యాస్సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం... ముగ్గురికి తీవ్ర గాయాలు - CRIME NEWS
ప్రమాదవశాత్తు గ్యాస్సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం సాంక్రియా తండాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
గ్యాస్సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం... ముగ్గురికి తీవ్ర గాయాలు
వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం సాంక్రియా తండాలో ప్రమాదవశాత్తు గ్యాస్సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిత్యావసర వస్తువులు సహా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.