రాయపర్తిలో 16 ఎంపీటీసీ స్థానాలకు 24 మంది నామినేషన్లు - rural
స్థానిక ఎన్నికల రెండో విడత నామినేషన్ల పర్వం తొలిరోజు ముగిసింది. రెండు రోజుల గడువున్నా మొదటి రోజు నామినేషన్ వేసేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.
ఎంపీటీసీ స్థానాలకు 24 మంది నామినేషన్లు
రెండో విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పర్వం తొలి రోజు ముగిసింది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో జడ్పీటీసీ స్థానానికి ఒకరు, 16 ఎంపీటీసీ స్థానాలకు 24 మంది నామపత్రాలు సమర్పించారు. మరో రెండు రోజుల గడువు ఉన్నా తొలి రోజునే నామినేషన్ వేసేందుకు పలువురు ఉత్సహం చూపారు. ఈ సందర్భంగా కార్యలయాల వద్ద సందడి నెలకొంది.