తెలంగాణ

telangana

ETV Bharat / state

గుడుంబా బట్టీలను ధ్వసం చేసిన యువకులు

కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.. సందట్లో సడేమియా అన్నట్టుగా గుడుంబా తయారీదారులు రెచ్చిపోతున్నారు. పల్లెల్లో గుడుంబా తయారీ సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ మొదలైంది. ఈ సంఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది.

By

Published : Mar 28, 2020, 7:39 AM IST

the-young-men-who-made-the-sound-of-gudumba-batiks
గుడుంబా బట్టిలను ధ్వసం చేసిన యువకులు

వరంగల్ గ్రామీణ జిల్లా గొల్లపల్లెలో గుడుంబా తయారీ యథేచ్ఛగా జరుగుతోంది. ఆ గ్రామ సర్పంచ్ పూలమ్మతో కలిసి కొంతమంది యువకులు తయారీని అడ్డుకున్నారు. వ్యవసాయ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా తయారుచేస్తున్న బట్టీలను ధ్వంసం చేశారు.

గుడుంబా తయారు చేసే వారు యువకులతో వాగ్వాదానికి దిగారు. తయారీనీ అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారని యువకులు పేర్కొన్నారు. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గుడుంబా బట్టిలను ధ్వసం చేసిన యువకులు

ఇదీ చూడండి :బాధ్యతగా ఉండకపోతే... తప్పదు భారీ మూల్యం

ABOUT THE AUTHOR

...view details