ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నిలువరించడం కోసం పట్టణాలను పోలీసులు నిర్భందం చేస్తుండగా... గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉంటూ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తున్నారు.
కరోనా కట్టడికై నాచినపల్లి గ్రామం స్వచ్ఛంద స్వీయ నిర్బంధం - కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా నాచినపల్లి గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
![కరోనా కట్టడికై నాచినపల్లి గ్రామం స్వచ్ఛంద స్వీయ నిర్బంధం the-people-of-warangal-rural-villages-have-declared-a-self-lockdown-due-to-corona-care](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6571489-379-6571489-1585383964463.jpg)
నాచినపల్లి గ్రామం స్వచ్ఛంద స్వీయ నిర్బంధం
నాచినపల్లి గ్రామం స్వచ్ఛంద స్వీయ నిర్బంధం
గ్రామపంచాయతీ సిబ్బంది మురుగు కాలువలను శుభ్రం చేయచడం, గ్రామంలో రోడ్ల కిరువైపులా బ్లీచింగ్ పౌడర్‌ను చల్లడం వంటి చర్యలు చేపట్టారు. కరోన వైరస్ వ్యాప్తి చెందకుండ డెటాల్‌ను వాటర్ ట్యాంకర్లో కలిపి గ్రామంలోని రోడ్లన్నీ కడిగించారు. గ్రామ ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తున్నారని, తమవంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నామని సర్పంచ్ పెండ్యాల మమత అన్నారు.
ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి