చెత్తా చెదారాన్ని తొలగించడం... గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం.. నెలరోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలులో ప్రధానాంశం. మాటల్లో చెప్పడం కన్నా... ఆచరణలో చేసి చూపిస్తే.... అందరూ స్ఫూర్తి పొందుతారని భావించారో... ఏమో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు... స్వయంగా రోడ్డుపై ఉన్న చెత్తను తొలిగించారు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యచరణ అమలు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో కలియదిరిగారు. రోడ్డుపై ఉన్న చెత్తను గమనించి వెంటనే పార పట్టుకున్నారు. చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. ఇరువైపులా గుబురుగా పెరిగిన పొదలను తొలగించారు. జిల్లా కలెక్టర్ హరిత, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందనరావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇందులో పాలుపంచుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోకి వెళ్లి లంబోదరుడిని దర్శించుకున్నారు.
రోడ్డుపై చెత్తను తొలిగించిన మంత్రి - WGL
వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి రోడ్డుపై చెత్తను తొలగించారు.

మంత్రి