వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పురపాలికలో అకాల వర్షంతో పంట పొలాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడిన పంటంతా నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
'రైతులు అధైర్యపడొద్దు.. ప్రతి గింజను కొంటాం' - grain was drenched in Warangal
అకాల వర్షంతో వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
వర్ధన్నపేటలో తడిసిన ధాన్యం
మున్సిపల్ ఛైర్పర్సన్ అంగోతు అరుణ నీటమునిగిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు అధైర్యపడకూడదని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.