వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా కొనసాగాయి. 1944 ముంబయి విపత్తులో 66 మంది అగ్నిమాపక సిబ్బంది వీరమరణం పొందారు. దానికి గుర్తుగా ప్రతీ ఏటా ఏప్రిల్ మాసంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అమర విపత్తు యోధులకు నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.
ఉత్సాహంగా కొనసాగిన.. అమర విపత్తు యోధుల వారోత్సవాలు - Immortal Disaster Warriors vaarosavalu
అమర విపత్తు యోధులకు గుర్తుగా... వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో అగ్నిమాపక వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగాయి. విపత్తు సిబ్బంది ఫైర్ ఇంజిన్తో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
అమర విపత్తు యోధుల వారోత్సవాలు
అగ్ని ప్రమాదాల నిర్మూలనకు ముందస్తు జాగ్రత్తలే కీలకమని అన్నారు. మాక్ డ్రిల్ నిర్వహించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విపత్తు సిబ్బంది ఫైర్ ఇంజిన్తో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.