వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో భూ వివాదం కారణంగా కూసలత మృతి చెందింది. గ్రామానికి చెందిన పోసరుపు రాజయ్య, అనుముల మల్లయ్య కుటుంబాల మధ్య భూతగాదా జరిగింది. వీరిరువిరికీ పక్కపక్కనే ఇళ్లతో పాటు వ్యవసాయ భూములు సైతం పక్కపక్కనే ఉన్నాయి.
భూ వివాదంతో ఇరు కుటుంబాల మధ్య రాళ్ల దాడి.. మహిళ మృతి - భూతగాదా కారణంగా ఓ మహిళ మృతి
భూవివాదం కారణంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఇటుకాలపల్లి గ్రామంలో జరిగింది.
భూ వివాదంతో ఇరు కుటుంబాల మధ్య రాళ్ల దాడి.. మహిళ మృతి
కాగా తన భూమిలో నుంచి ట్రాక్టర్ను తీసుకెళ్లారని రాజయ్య కుటుంబ సభ్యులను మల్లయ్య తిట్టడం వల్ల ఇరవర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదికాస్త పెద్దదై రాజయ్య కుటుంబంపై మల్లయ్య కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో రాజయ్య కూతురు కూసలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:వామ్మో సూపర్ స్ప్రెడర్స్... వారి వల్లే 300 మందికి కరోనా