వ్యవసాయ బావిలో దొరికిన మొసలిని.. అటవీ అధికారులు పట్టుకొని సరస్సులో వదిలేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేట శివారులోని ఓ వ్యవసాయ బావి అడుగంటింది. అందులో మొసలిని గమనించిన స్థానికులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
బావిలో ప్రత్యక్షమైన మొసలి.. పాకాల సరస్సుకు తరలింపు - పాకాల సరస్సు
వరంగల్ గ్రామీణ జిల్లాలోని ఓ వ్యవసాయ బావిలో.. మొసలి లభ్యమైంది. మొసలిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలి రావడం వల్ల ఆ చుట్టు పక్కల సందడి వాతావరణం నెలకొంది.
బావిలో ప్రత్యక్షమైన మొసలి
ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. మొసలిని పట్టి... పాకాల సరస్సులో వదిలేశారు. ఎక్కడైనా మొసలి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, తాము వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
ఇదీ చదవండి:మొన్న భర్త.. నేడు భార్య.. అనాథలైన చిన్నారులు
Last Updated : Apr 8, 2021, 11:02 PM IST