పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో కలెక్టర్ హరిత పర్యటించారు. స్థానిక మున్సిపల్ కమీషనర్, ఛైర్ పర్సన్లలతో కలిసి మున్సిపల్ పరిధిలోని 5, 6వ వార్డులు, డీసీ, గుబ్బెట తండాల్లో విస్తృతంగా తనిఖీ చేశారు. రోడ్లు, పారిశుద్ధ్యం, త్రాగునీరు, పచ్చదనం మెరుగు పరుచుకోవాలని సూచించారు.
ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో కలెక్టర్ హరిత పర్యటించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పట్టణంలో ఉన్న ప్రజలు సైతం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. ఇప్పుడు పట్టణ ప్రగతి కూడా అదే సంకల్పంతోనే ప్రవేశపెట్టారని అన్నారు. అందులో భాగంగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పాలక వర్గాలు పనిచేయాలని అన్నారు. పట్టణంలో ఉన్న ప్రజలు సైతం తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ఇదీ చూడండి :చికెన్, గుడ్లతో ఆరోగ్యం.. అందరూ తినండి: మంత్రి కేటీఆర్