తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్య పరీక్షలకు ఆర్థిక సాయం అందజేత - వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​

ఆరోగ్యశ్రీలో లేని వివిధ రకాల వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​. సీఎం రిలీఫ్​ ఫండ్​ కింద సహాయం అందించినట్లు పేర్కొన్నారు.

చెక్కుల పంపిణీ

By

Published : Jul 11, 2019, 5:13 PM IST

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఆరోగ్యశ్రీలో లేని వివిధ రకాల వ్యాధుల వైద్య పరీక్షలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ చెక్కుల రూపంలో అందించారు. 139 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ కింద మొత్తం 47 లక్షలు అందజేసినట్లు తెలిపారు. ఒక్క వర్ధన్నపేటలోనే 7 లక్షల 30 వేల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రశంసించారు.

వైద్య పరీక్షలకు ఆర్థిక సాయం అందజేత

ABOUT THE AUTHOR

...view details