వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఉదయం మూడు గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తాత్కాలిక సిబ్బంది తమకు సహకరించాలని, బస్సులు తీయడానికి వీల్లేదంటూ డిపో వద్ద నుంచి వారిని పంపించేశారు. విషయం అందుకున్న పరకాల సీఐ డిపో వద్దకు చేరుకుని న నిరసన చేస్తున్న కార్మికులను వెళ్లగొట్టారు. అనంతరం తాత్కాలిక సిబ్బందితో బస్సులను పంపించారు.
'ఆర్టీసీ కార్మికులకు తాత్కాలిక సిబ్బంది సహకరించాలి' - rtc workers strike against of government
తాత్కాలిక డ్రైవర్లు విధులు కొనసాగించడం వల్ల ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని పరకాలలో నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆర్టీసీ కార్మికులకు తాత్కాలిక సిబ్బంది సహకరించాలి'