ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ ప్రచారం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత క్రమంలో తనకు ఓటు వేయాలని పట్టభద్రులను అభ్యర్థించారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: చెరుకు సుధాకర్ - warangal rural updates
వరంగల్ గ్రామీణ జిల్లాలో తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్ ప్రచారం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు.
![సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: చెరుకు సుధాకర్ Telangana Home Party candidate Cheruku Sudhakar campaigned in Warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10879863-660-10879863-1614929545618.jpg)
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: చెరుకు సుధాకర్
పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో తిరిగి ఓటుని కోరారు. తనను గెలిపించి శాసన మండలికి పంపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు