వరంగల్ రూరల్ జిల్లా నడికూడా మండలం కౌకొండ గ్రామంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నోజు శ్రీనివాసచారి పర్యటించారు. పంట నష్టంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. అత్యధికంగా పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.
రైతుల తరఫున పోరాటం చేయడానికి తెదేపా సిద్ధం: శ్రీనివాసచారి - కౌకొండలో పర్యటించి తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసచారి
వరద బాధితులకు రూ. 10వేల అందిస్తున్న సీఎం కేసీఆర్.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నోజు శ్రీనివాసచారి ప్రశ్నించారు. వరంగల్ రూరల్ జిల్లా కౌకొండ గ్రామంలో పర్యటించి నష్టం వాటిల్లిన పంటపొలాలను పరిశీలించారు.
రైతుల తరఫున పోరాటం చేయడానికి తెదేపా సిద్ధం: శ్రీనివాసచారి
పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. పరిహారం అందించకపోతే రైతుల కోసం ఉద్యమం చేపట్టడానికి టీడీపీ సిద్దంగా ఉందన్నారు.
ఇదీ చూడండి:తూకాలను జాప్యం చేయకూడదు: మంత్రి ఈటల