హుజూర్నగర్ ఎన్నికల్లో తెరాస గెలుపుతో ప్రజలంతా తమపక్షానే ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విర్రవీగుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు చేపట్టిన దీక్షను ఆయన విరమింపజేశారు. గతంలో సకలజనుల సమ్మె చేసిన నాడు ఆర్టీసీ కార్మికులు ఉద్యమానికి ఎంతో ఊతమిచ్చారని, అయినప్పటికీ కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారి న్యాయమైన కోరికలను నెరవేర్చాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు పతనం తప్పదని ఆయన హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు పతనం తప్పదు: తమ్మినేని
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు చేపట్టిన దీక్షను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరమింపజేశారు. హుజూర్నగర్లో తెరాస.. ప్రజల మద్దతుతో గెలవలేదని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు పతనం తప్పదు: తమ్మినేని