ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన కళ్లెపు సుభాష్(48) ప్రతి రోజు మాదిరిగానే ఈరోజు ఉదయం తాటివనానికి వెళ్లాడు. తాటి చెట్టు ఎక్కి కల్లు గీసుకొని కిందికి దిగే క్రమంలో కాలుజారడం వల్ల అదుపుతప్పి కింద పడ్డాడు. అతని తలకు, వీపునకు నడుముకు, బలమైన దెబ్బలు తగలగా... గమనించిన స్థానికులు పరకాల ఆస్ఫత్రికి తరలించారు.
తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి
ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి జారిపడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా కొప్పుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతి
వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఎంజీఎం తరలిస్తుండగా మార్గమధ్యలో సుభాష్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: దారుణం..! కన్న కూతురిపై తండ్రి అత్యాచారం