తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమ పట్టాపాసు పుస్తకం కేసులో కఠిన చర్యలు : కలెక్టర్​ - అక్రమ పట్టాదారు పాసు పుస్తకంపై విచారణ జరుపుతున్నట్లు కలెక్టర్ హరిత

అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకం సంపాదించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. తక్కళ్లపాడు గ్రామంలోని సర్వే నంబర్ 392లో 5.05 ఎకరాల భూమిని మాజీ సర్పంచి దాడి మల్లయ్య అక్రమంగా పట్టాదారు పాసు పుస్తకం సంపాందించాడు. దీనిపై కలెక్టర్​ హరిత స్పందించారు.

Strict measures on illegal bookkeeping warangal rural collector
అక్రమ పట్టాపాసు పుస్తకంపై కఠిన చర్యలు : కలెక్టర్​

By

Published : Dec 19, 2019, 10:31 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండలం తక్కళ్లపాడు గ్రామంలో అక్రమ పట్టాదారు పాసు పుస్తకంపై విచారణ జరుపుతున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. తక్కళ్లపాడులోని సర్వే నంబర్ 392లో గల 5.05 ఎకరాల భూమిని మాజీ సర్పంచి దాడి మల్లయ్య తన పలుకుబడిని ఉపయోగించుకొని పట్టాదారు పాస్ పుస్తకం సంపాందించాడు.

తన కుటుంబ సభ్యుల పేరుమీద భూమిని అదనంగా రికార్డుల్లో చేర్పించి పట్టాను పొందాడు. గ్రామ రెవెన్యూ అధికారి సహకారంతో అధికారికంగా 5.05 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాన్ని సంపాదించాడు. దీనిపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ హరిత ఆర్డీవో నుంచి నివేదిక అందిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతుబంధు ద్వారా లబ్ది పొందిన నగదును కూడా తిరిగి తీసుకుంటామని స్పష్టం చేశారు.

అక్రమ పట్టాపాసు పుస్తకంపై కఠిన చర్యలు : కలెక్టర్​

ఇదీ చూడండి : అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్​ రావు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details