తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఆ యువకున్ని చదివించారు. తనను ఉన్నత స్థానంలో చూడాలన్న వారి ఆశయాలను అతను నెరవేర్చాడు. దేశ అత్యున్నత పరీక్ష సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 131వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు వరంగల్ జిల్లాకు చెందిన శ్రీపాల్. తమ కుమారుడు ఉన్నత ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు మంజుల, సాంబశివరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు 8 గంటలు..
శ్రీపాల్ వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన వాడు. ఇంటి వద్దనే ఉంటూ రోజుకు 8 గంటల చొప్పున శ్రమించి లక్ష్యాన్ని సాధించాడు. దిల్లీలోని కోచింగ్ కేంద్రాల నుంచి పరీక్షకు సంబంధించిన మెటీరియల్‌ను తెప్పించుకుని సాధన చేశాడు. సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడం పట్ల స్థానికులు అభినందించారు.
సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన రైతు బిడ్డ ఇదీ చదవండి :సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదల