వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం కన్నులపండువగా సాగింది. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్థులే పెళ్లిపెద్దలుగా మారి ప్రతి ఏటా అంగరంగా వైభవంగా స్వామి వారికి కల్యాణం నిర్వహిస్తారు.
వైభవంగా ముగిసిన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు - sri someshwara lakshmi narasimha swamy kalyanam in bandanapally
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ గ్రామీణ జిల్లాలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

బందనపల్లి, శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు స్వామి వారి కల్యాణంతో ముగుస్తాయి. ప్రభాబండ్ల ప్రదక్షిణలు.. ముత్తైదువుల కోలహలాల మధ్య జాతర అట్టహాసంగా సాగింది.
ఇదీ చదవండి:ఏకకంఠంతో హరినామ సంకీర్తనలు... ఘనంగా వేడుకలు