భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో రథోత్సవం వైభవంగా జరిగింది. వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలోని ఆలయంలో భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. మొదట స్వామివారిని గుట్టపై నుంచి కిందకు తీసుకొచ్చారు.
వైభవంగా శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు రథంపై ఊరేగించారు. వేడుకలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
గీసుకొండలో లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
ఉదయాన్నే రథాన్ని అలంకరించి... పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి వేడుకలు జరిపారు. పోలీసు బందోస్తు మధ్య భక్తులందరు గోవింద నామస్మరణతో రథాన్ని కదిలించారు. చివరి ఘట్టమైన రథోత్సవంతో జాతర ప్రశాంతంగా ముగిసింది.