Seeking For Help: వరంగల్ తూర్పు కోట సమీపంలోని యాదవనగర్‌కు చెందిన కుక్కల శివ జీవితం రెండున్నరేళ్ల వరకు హాయిగా గడచిపోయింది. చిన్నపాటి ఉద్యోగం చేస్తూ పేదలైన అమ్మానాన్నలకు ఆసరాగా ఉండేవాడు. ఓ రోజు బైక్‌పై స్నేహితుడి వివాహానికి వర్ధన్నపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఓ గుంత వల్ల శివ ప్రమాదానికి గురయ్యాడు. కింద పడగానే వెన్నెముక విరిగింది. హనుమకొండలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు రూ. 80 వేల వరకు ఖర్చయ్యింది. అయినా కూడా శివ పరిస్థితి బాగు పడలేదు.
మరింత కోలుకోవాలంటే..
తర్వాత ఆరు నెలల పాటు హైదరాబాద్‌లో ఫిజియో థెరపీ చేయించాల్సి వచ్చింది. అప్పుడు మరో రూ. 2 లక్షల వరకు ఖర్చయ్యింది. అప్పటి వరకు కనీసం అడుగు వేయలేని పరిస్థితి ఉండేది. ఫిజియోథెరపీ తర్వాత శివ తనంతట తానుగా చక్రాల కుర్చీలో కూర్చోగలుగుతున్నాడు. శివ ఆరోగ్యం మరింత కోలుకోవాలంటే మరో ఆరు నెలల పాటు చికిత్స అవసరం.