వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలంలోని 46 గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ గుంటి పల్లవి తన ఆలోచనకు పదునుపెట్టి పార్కుల్లో పచ్చదనమే కాకుండా వైవిధ్యంగా ఉండేలా ప్రోత్సహించారు. 13 గ్రామాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేకమైన పల్లెప్రకృతివనాలు ఏర్పాటు చేశారు.
రామాయణం ప్రత్యేకత
నాచినపల్లి రామాలయానికి అనుసంధానంగా పచ్చటి పొలాల మధ్యలో ఒక ఎకరం విస్తీర్ణంలో గ్రీన్ రామాయన్ పార్కును ఆరు ఘట్టాలతో ఏర్పాటు చేశారు. సీతారాములు అరణ్యవాసం చేసినప్పుడు ఏ ప్రాంతంలో పర్యటించారు.. ఎక్కడ సేదదీరారు.. వంటి చిత్రాలు వేయించారు. పల్లెలంటేనే వ్యవసాయం, రైతులు అనే భావన కలిగించేలా.... సర్పంచ్ మమత పార్కులో ఎండ్ల బండి పెట్టించి రంగులు వేయించారు. ఈ పార్కు వల్ల ఆహ్లాదంతోపాటు రామాయణం ప్రత్యేకత తెలుస్తోందని గ్రామస్థులు పేర్కొన్నారు.